GNTR: ఏపీ ప్రభుత్వం ‘మన ఊరి ప్రభుత్వ బడికి పోదాం’ కార్యక్రమాన్ని చేపట్టింది, ఇందులో భాగంగా 2026–27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక కోసం రూపొందించిన కరపత్రాలను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.