NRPT: మక్తల్ మండలం రుద్రసముద్రం గ్రామంలో దత్త గురుస్వామి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం అంబలి కేంద్రంని ప్రారంభించారు. తొమ్మిది సంవత్సరాలుగా నారాయణరెడ్డి స్వంత ఖర్చులతో ఈ అంబలి సేవను నిర్వహిస్తూ వస్తున్నారు. నిరుపేదలకు అంబలి పంపిణీ చేయడం ఎంతో పుణ్యకార్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు రామలింగం, గ్రామస్థులు పాల్గొన్నారు.