ADB: గాదిగూడ మండలంలోని మేడిగూడ గ్రామంలో సోమవారం బాల్యవివాహం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని పోలీసులు సమాచారాన్ని అందుకున్నారు. దీంతో ఎస్సై రమ్య సిబ్బందితో కలిసి వివాహం నిర్వహిస్తున్న కుటుంబానికి బాల్యవివాహం వల్ల వచ్చే పరిణామాలను వివరించి వారిని అడ్డుకున్నారు. ఎవరైనా బాల్యవివాహం నిర్వహిస్తే చట్టరీత్య చర్యలు తప్పవని హెచ్చరించారు.