NGKL: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణి కి 14 దరఖాస్తులు వచ్చినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా పోలీసులను సంప్రదించి చట్టపరమైన సాయం పొందాలని ఆయన సూచించారు.