NLG: ప్రాణత్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి సలీమ్ కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం దేవరకొండ పట్టణ కేంద్రంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నల్ల వెంకటయ్య అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు.