జగిత్యాల కలెక్టరేట్లో మహాత్మ బసవేశ్వర జయంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ బసవన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బసవేశ్వరుడు సమానత్వం, సత్యం, న్యాయం వంటి విలువలను బోధించారని పేర్కొన్నారు. కుల, వర్ణ వివక్షలను వ్యతిరేకించి సమాజంలో మార్పు తీసుకువచ్చిన మహానుభావుడని అన్నారు.