దీపికా పదుకొనె గర్భవతి కావడంతో ఇప్పటికే ఆమె సంతకం చేసిన చిత్రాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో ఒప్పుకున్న చిత్రాలను పూర్తి చేసిన తర్వాతే విశ్రాంతి తీసుకోవాలని ఆమె భావిస్తునట్లు సమాచారం. దీంతో ‘రాకా’ దర్శకుడు వెంటనే ఆమె పాత్రకు సంబంధించిన సీన్లను చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.