IPL 2026లో కోల్‌కతా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఆడిన 6 మ్యాచుల్లో ఒక్కటీ గెలవలేదు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రహానే పేలవ ఫామ్, కెప్టెన్సీ నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి గుజరాత్ మ్యాచులో ‘గోల్డెన్ డక్’ కావడంతో పరిస్థితి మరింత దిగజారింది. జట్టును గాడిలో పెట్టేందుకు అతణ్ని తప్పించి సునీల్ నరైన్‌ను కెప్టెన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.