JGL: కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నప్పటికీ వసతులు సరిగ్గా లేకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నిర్వహణపై అసంతృప్తితో కనీస వసతులు లేనప్పుడు హుండీలో ఎందుకు డబ్బులు వేయాలంటూ ప్రశ్నిస్తున్నారు. సౌకర్యాలు కల్పించే వరకు హుండీలో డబ్బులు వేయవద్దంటూ లేఖలు రాసి హుండీలో వేస్తున్నారు.