JN: స్టేషన్ ఘన్పూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీవో డీఎస్ వెంకన్న శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బందితో సమీక్ష నిర్వహించి, ప్రజలకు అందుతున్న సేవలపై తహసీల్దార్ స్వప్నను అడిగి తెలుసుకున్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సాధా బైనామా దరఖాస్తుల పరిష్కారం, ప్రభుత్వ భూముల పర్యవేక్షణపై సంతృప్తి వ్యక్తం చేశారు.
Tags :