పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం జోగిరాజు పేట గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉర్రాకుల శ్రీరాములు అనే వ్యక్తి మృతి చెందారు. బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణమైన బైక్దారుడు వాహనంతో సహా పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.