HNK: హసన్పర్తి మండలం వంగపహాడ్ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. గ్రామస్తులకు హెల్మెట్లు పంపిణీ చేసి రోడ్డు భద్రతపై ప్రమాణం చేయించారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.