SRCL: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని 10 హెచ్‌పీ లోపు పవర్ లూమ్స్‌కు ఉచిత విద్యుత్ అందించాలని మాక్స్ సొసైటీ నేతలు చిమ్మని ప్రకాశ్, భీమని రామచంద్రం కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్‌కు వినతిపత్రం అందజేశారు. రైతుల మాదిరిగానే నేతన్నలు శ్రమిస్తున్నారని, చిన్న ఆసాములను ఆదుకోవాలని వివరించారు.