ATP: రైతులకు ప్రభుత్వ పథకాలు, రుణాలపై బ్యాంక్ మేనేజర్లు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. శుక్రవారం గుత్తి ఎంపీడీవో కార్యాలయంలో బ్యాంక్ మేనేజర్లతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రుణాల మంజూరు చేసేందుకు బ్యాంక్ మేనేజర్ సహకరించాలన్నారు.