HNK: కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ అన్నారు. BRS హుస్నాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో భాగంగా ఎల్కతుర్తి నేతలతో సతీష్ కుమార్ సమావేశమయ్యారు. ప్రజలంతా తిరిగి కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని అన్నారు.