NZB: బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జనగణన మొదటి దశ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ వికాస్ మహతో హాజరై, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు విధులపై దిశానిర్దేశం చేశారు. 34 అంశాలపై పూర్తి అవగాహన పెంచుకుని, సర్వేలో సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. జనాభా లెక్కల ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.