JGL: జగిత్యాల రూరల్ మండలం కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 99 రోజుల ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో’ భాగంగా పోషకాహార అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌజన్య, ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.