TG: కేసీఆర్ మీద ఒట్టేసి BRSలోనే ఉంటానని హరీష్ రావు చెప్పాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. గతంలోనూ హరీష్ రావు YSR దగ్గరికి వెళ్లారని అన్నారు. ‘ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నారో నాకు తెలుసు. కానీ చెప్పను. ఇటీవల ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? BJP, BRSలు కలిసి పోటీ చేస్తాయనడంలో అనుమానం లేదు. CBSEలో జవాబు పత్రాలు తారుమారు చేసిన గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థ’ అని రేవంత్ అన్నారు.