HNK: ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలోని విత్తనాలు, పురుగుమందుల దుకాణాన్ని శనివారం అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ రమేశ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిషేధించిన బీటీ-3 విత్తనాలు, నకిలీ పురుగుమందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తన వ్యాపారులు నిబంధనలు పాటించి, రైతులకు నాణ్యమైన విత్తనాలనే అందించాలని సూచించారు.