MLG: జిల్లా కేంద్రంలో గ్రూప్-1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికై శిక్షణ పొందుతున్న దైనంపెళ్లి ప్రవీణ్ కుమార్ను శనివారం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, ఏటూరునాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత దంపతులు హైదరాబాద్లో సన్మానించారు. శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రవీణ్ కుమార్ సాధించిన విజయం ప్రాంతానికి గర్వకారణమన్నారు.