కడప పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఇవాళ ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏఆర్ డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పరిశుభ్రతతోనే ప్రశాంతత, ఆరోగ్యం సాధ్యమవుతాయని తెలిపారు. ఎస్పీ నచికేత్ ఆదేశాలతో పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని భావితరాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు.