మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ కౌన్సిలర్ చౌదరి చరిత శనివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి, వార్డుల్లోని ప్రజా సమస్యలపై చర్చించారు. నియోజకవర్గ ప్రగతికి హరీష్‌రావు అందిస్తున్న సహకారం అభినందనీయమని కొనియాడారు. సమస్యల పరిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందించారని చరిత పేర్కొన్నారు.