SRPT: హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 3, 19, 23 వార్డుల్లో వీధి కుక్కల బెడద పెరిగింది. శుక్రవారం కుక్కల దాడిలో ఒక చిన్నారి, ఒక మహిళ గాయపడ్డారు. గుంపులు గుంపులుగా తిరుగుతున్న కుక్కల ధాటికి వృద్ధులు, మహిళలు బయటకు రావడానికే భయపడుతున్నారు. వెంటనే సంబంధిత శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.