ఇటీవల క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తనకు ‘క్యూట్’ అంటూ మెసేజ్ చేశాడని బాలీవుడ్ నటి తాన్యా ఛటర్జీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై చాహల్ పరువు నష్టం దావా వేశాడంటూ తాన్యా మరోసారి చెప్పుకొచ్చింది. అందరూ తననే ప్రశ్నిస్తున్నారు కానీ చాహల్‌ని అడగట్లేదని పేర్కొన్న ఆమె.. తనకు అతను పరువు నష్టం దావా నోటీసులు పంపాడని తెలిపింది. అతను ఇలా చేయడం అర్థరహితంగా ఉందంది.