MBNR: మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామంలో నిర్వహించిన ‘బడిబాట’లో హెచ్ఎం తారా సింగ్ పాల్గొన్నారు. నర్సరీ నుంచి 5వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యనందిస్తున్నామని తెలిపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇస్తామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొంది.