SRCL: వేములవాడ పట్టణంలో రవాణా శాఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన బస్సులు, వ్యాన్లను ఏఎంవీఐ పృథ్వీరాజ్ వర్మ తనిఖీ చేసి నిబంధనలకు అనుగుణంగా లేని రెండు బస్సులపై కేసు నమోదు చేశారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామని, ప్రతి వాహనం నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.