WGL: నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో ఈ నెల 20వ తేదీ నుంచి మొక్కజొన్నతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ప్రారంభం కానున్నట్లు మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పాల్వాయి శ్రీనివాస్ తెలిపారు. రైతులు మార్కెట్కు తీసుకువచ్చే ధాన్యం వివరాలను యార్డ్ గేటు వద్ద ఉన్న ఎంట్రీ రిజిస్టర్లో నమోదు చేయించుకుని తరువాత మాత్రమే లోపలికి తీసుకురావాలని రైతు సోదరులకు తెలిపారు.