BDK: అశ్వరావుపేటలో మరో ఉద్యాన కళాశాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలతో ఈ ఉద్యాన కళాశాల ఏర్పాటుకు రంగం సిద్ధమైనది. రాష్ట్రంలో సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాలో ఈ ఉద్యాన కళాశాలలో ఇప్పటికే ఉన్నాయి. ఉద్యాన పంటలకు అనువైన జిల్లాగా ఉన్న భద్రాద్రిలో ఈ సాగు విస్తీర్ణాన్ని పెంచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.