SRD: పోతిరెడ్డిపల్లిలో హైవేపై ఇవాళ తెల్లవారుజామున మద్యం మత్తులో ఇద్దరు యువకులు గొడవకు దిగారు. స్థానికుల సమాచారం.. మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ (25), చాకలి ప్రశాంత్(30)ల మధ్య వాగ్వాదం పెరగడంతో, ఇమ్రాన్ కోపంతో ప్రశాంత్ తలపై రాయితో కొట్టాడు. దీంతో ప్రశాంత్ తల పగిలి రక్తపు మడుగులో పడిపోయాడు. స్థానికులు 108కు సమాచారం అందించగా, కంది హాస్పిటల్కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.