NLG: పిల్లల ఆరోగ్యానికి పౌష్టికహారం కీలకమని త్రిపురారం మండలం చెరువు అన్నారం సర్పంచ్ చిత్రం శివమ్మ అన్నారు. అంగన్వాడీలో టీచర్ నవనీత ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ పక్వాడ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. గర్భిణీలు, బాలింతలు, 6 ఏళ్లలోపు పిల్లల్లో పోషకాహార స్థాయిని పెంచడం, రక్తహీనతను తగ్గించడం ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. అంగన్వాడీలు సమయపాలన పాటించాలన్నారు.