TG: రాష్ట్రవ్యాప్తంగా 99 డేస్ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 20 నుంచి 26 వరకు సంక్షేమ వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడం, ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశం.