KNR: హుజూరాబాద్ పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీసులు “Arrive Alive” రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ACP మాధవి, RTO కంచి వేణు, CI కరుణాకర్ ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. అతివేగం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ సుహాసిని పాల్గొన్నారు.