NDL: ఆత్మకూరులో ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరచిన థెరిసా జూనియర్ కళాశాల విద్యార్థులను ఇవాళ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అభినందించారు. వేల్పనూరులో జరిగిన కార్యక్రమంలో టాపర్లను సత్కరించి ప్రోత్సాహం అందించారు. పట్టుదలతో సాధన చేస్తేనే ఉన్నత శిఖరాలు సాధ్యమని ఆయన పేర్కొన్నారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకుల సేవలను ఈ సందర్భంగా ప్రశంసించారు.