ATP: CM చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల 20న కళ్యాణదుర్గంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. సుమారు 8 వేల మందితో రక్తదానం చేయించి రికార్డు సృష్టించాలని పిలుపునిచ్చారు. యువత పెద్ద ఎత్తున పాల్గొని ప్రాణదాతలుగా నిలవాలని కోరారు.