NTR: నందిగామ గాంధీనగర్ సెంటర్ కార్ స్టాండ్ వద్ద హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని SI మోహన్ రావు ప్రారంభించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజల దాహం తీర్చేందుకు ఇలాంటి సేవలు అందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. సొంత డబ్బును, సమయాన్ని వెచ్చించి సమాజ సేవ చేస్తున్న సభ్యుల కృషిని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.