KRNL: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఇవాళ ఆదోని -2 మండల BJYM అధ్యక్షుడు బెస్త నాగరాజు ఖండించారు. ఈ వ్యవహారం భారత ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చేలా ఉందని ఆయన తెలిపారు. మహిళల ఆశలను దెబ్బతీస్తూ సాధికారతకు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. మహిళల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.