176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన DC జట్టుకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ నిస్సాంక(1)ను తొలి ఓవర్లోనే భువనేశ్వర్ పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత తన రెండో ఓవర్లో కరుణ్ నాయర్ (5), సమీర్ రిజ్వీ (2)లను ఔట్ చేసి ఢిల్లీని కోలుకోలేని దెబ్బ తీశాడు. దీంతో 2.5 ఓవర్లలో ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 18 పరుగులు చేసింది. క్రీజులో స్టబ్స్ (4), రాహుల్ (15) ఉన్నారు.