W.G: నరసాపురం అర్బన్ బ్యాంక్ నూతన ఛైర్మన్‌గా నియమితులైన వలవల నాని ఇవాళ స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకానికి సహకరించినందుకు ఆయన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఛైర్మన్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.