TG: ఎన్డీయే సర్కారు మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా బిల్లు వీగిపోవడం.. బీజేపీ విధానాల ఓటమిగా భావించాలన్నారు. బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్షాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీ చాలా చేసిందని గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.