SRD: జోగిపేట కోట నిజాం కాలం వైభవానికి సాక్ష్యంగా నిలుస్తోంది. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతం నిజాం పాలనలోకి వచ్చాక పరిపాలన, రక్షణ అవసరాల కోసం ఈ కోటను ఉపయోగించారు. ఇక్కడి ఇండో-ఇస్లామిక్ శైలి కట్టడాలు, గడిలు నాటి గొప్పతనాన్ని చాటుతున్నాయి. చారిత్రక ఆంధ్ర మహాసభలకు వేదికైన ఈ కోట, తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనూ కీలక పాత్ర పోషించింది.