NGKL: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రమేష్ కుమార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, పారదర్శకత కోసం ప్రత్యేక స్క్వాడ్‌ను ఏర్పాటు చేశాయని పేర్కొన్నారు.