MDK: చిన్న శంకరంపేట మండలం ఖాజాపూర్, కుమ్మరిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన ధాన్యం ఉప్పల్లోకి నీరు చేరడంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.