KRNL: మంత్రాలయం మం. చిలకలడోనలో మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DSP భార్గవి హాజరయ్యారు. మహిళలపై వేధింపులు సహించమని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని, బాలికల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సీఐ గిరిబాబు, ఎస్సై పాల్గొన్నారు.