SRD: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువు నేటితో ముగియనున్నట్లు సంగారెడ్డి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జానకి దేవి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన లేదా ఈ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. గడువు నేటితో ముగుస్తుండటంతో ఆసక్తి గల విద్యార్థులు ఆలస్యం చేయకుండా వెంటనే అధికారిక వెబ్సైట్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.