అన్నమయ్య: మదనపల్లె(M) కొత్తఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ (45)హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 11న CTM రోడ్డులో తట్టివారిపల్లి చెరువు కట్టపై శంకర్ హత్యకు గురయ్యారు. దర్యాప్తులో రామారావు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ షాదిక్ (25), వినయ్ కాంత్ (25)లను నిందితులుగా గుర్తించారు. ఆదివారం వారిని విచారించగా, హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించారు.