KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం బసవ జయంతి సందర్భంగా స్థానిక సెలవు ప్రకటించినట్లు యార్డు కార్యదర్శి గోవిందు వెల్లడించారు. ఎడ్ల బండ్ల కార్మికులు చేసిన విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. పండుగ రోజున కార్మికులందరికీ విశ్రాంతి కల్పించడం, సంప్రదాయాలను గౌరవించడం లక్ష్యంగా సెలవు ప్రకటించినట్లు చెప్పారు.