ATP: గుత్తి పట్టణంలో ఇవాళ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రతినిధులు తెలిపారు. సాయంత్రం 4.30 గంటలకు రూ. 30 కోట్ల నిధులతో గుత్తి నుంచి గుంతకల్‌కు వెళ్లే రహదానికి భూమి పూజ చేస్తారన్నారు. అలాగే గుత్తి నుంచి ధర్మాపురం గ్రామానికి కోటి రూపాయలు నిధులతో నూతన రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేస్తారన్నారు.