TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన SEEPC సర్వే ఆసక్తికరమైన నిజాలను బయటపెట్టింది. హైదరాబాద్లో ఏకంగా 70.63 శాతం మంది అద్దె ఇళ్లలోనే జీవిస్తున్నారని తెలిపింది. ఇక్కడ కేవలం 23.08 శాతం మందికి మాత్రమే సొంత ఇల్లు ఉందట. నిలకడలేని జాబ్ మార్కెట్ కూడా ప్రజలను హైదరాబాదులో సొంతింటి కలకు దూరంగా ఉండేలా చేస్తోందని నిపుణులు అంటున్నారు.