TG: జగిత్యాల ప్రజాశీర్వాద సభలో కళాకారులు ఆట పాటలతో ప్రజలను అలరిస్తున్నారు. ఎటువైపు చూసినా.. రహదారులన్నీ గులాబీమయమయ్యాయి. కాసేపట్లో కేసీఆర్ సభకు చేరుకోనున్నారు. ముందుగా కేసీఆర్ సర్వమత ప్రార్థనల్లో పాల్గొననున్నారు. అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కీలక నేతలతో భేటీ కానున్నారు. తర్వాత ప్రజాశీర్వాద సభలో పాల్గొంటారు.