KDP: మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ బసవేశ్వరుడికి నివాళులర్పించి, ఆయన సమానత్వం, న్యాయం, ధర్మం కోసం చేసిన సేవలను కొనియాడారు. కులవివక్ష నిర్మూలన, “పని చేయడమే పూజ” అనే సిద్ధాంతం ద్వారా సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారని పేర్కొన్నారు.